ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 3:12 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గాంధీ జయంతి సందర్బంగా ఇద్దరు నిరుపేద ఆదివాసి పిల్లలని అడ్మిషన్ చూపించిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు.

గాంధీ జయంతి సందర్బంగా ఇద్దరు నిరుపేద ఆదివాసి పిల్లలని అడ్మిషన్ చూపించిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు.

జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 1:

ఇంద్రవెల్లి : అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకొని వ్యాస స్కూల్ ఇంద్రవెల్లి బ్రాంచ్ లో నిరుపేద పిల్లల చదువు మరియు భవిష్యత్ కోసం ప్రారంభించిన వ్యాస విద్య వారధి కార్యక్రమం లో భాగంగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యాయవాది ఇమ్మనేని రామారావు గారు శంకర్ గూడా దగ్గర దుబ్బగూడ కి చెందిన ఇద్దరు ఆదివాసి పిల్లల స్కూల్ ఫీ చెల్లించి వ్యాస స్కూల్ లో అడ్మిషన్ చేపించడం జరిగింది.. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా ఉట్నూర్ కోర్ట్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పెందొర్ ప్రభాకర్ మరియు న్యాయవాది కూడేల్లి అశోక్ గార్లు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా వ్యాస చైర్మన్ వినోద్ నాయక్ మరియు పెండోర్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న వెనుకబాటు తనం పోవాలంటే కేవలం విద్య తోనే సాధ్యం అని, హైదరాబాద్ లో హైకోర్ట్ లో ప్రముఖ న్యాయవాది ఇమ్మనేని రామారావు గారు ఇంద్రవెల్లి మండలంలో మారుముల ప్రాంతంలో ఉన్న నిరుపేద విద్యార్థుల చదువుని దత్తత తీసుకోవడం ఎంతో గొప్ప విషయం అని,ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోని మరింత మంది పెద్ద మనసు తో ముందుకి రావాలని కోరారు.. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మరియు అతిదులు ఇమ్మనేని రామారావు కి కృతజ్ఞతలు తెలిపారు ..ఈ కార్యక్రమం లో ప్రధాన్ సమాజ్ యూత్ సభ్యులు ఉమేష్, పవన్, లాలు ప్రసాద్, మహేష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు